భోపాల్ : ఫారిన్ కు చెందిన 60 మంది తబ్లిగీలను భోపాల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. టూరిస్ట్ వీసా పై మన దేశానికి వచ్చిన వీళ్లు నిబంధనలు ఉల్లంఘించారు. టూరిస్ట్ వీసాలపై వచ్చిన వారు మతపరమైన కార్యక్రమాలకు హాజరుకావద్దు. కానీ నిబంధనలను ఉల్లంఘించి మర్కజ్ లో జరిగిన మత పరమైన కార్యక్రమాలకు హాజరయ్యారని పోలీసులు చెబుతున్నారు. దీంతో పోలీసులు వీరిపై ఏడు కేసులు నమోదు చేశారు. వీరికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించటంతో పోలీసులు 60 మంది తబ్లిగీలను అరెస్ట్ చేశారు. కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, టాంజానియా, సౌత్ ఆఫ్రికా, మయన్మార్ ల నుంచి వీరంతా మార్చి లో మన దేశానికి వచ్చారు. దేశ వ్యాప్తంగా వీరు ఎక్కడెక్కడ తిరిగారో అన్నది విచారిస్తున్నారు.
