తల్వార్​తో హల్​చల్.. యువకుడి అరెస్ట్ !

తల్వార్​తో హల్​చల్.. యువకుడి అరెస్ట్ !

చాంద్రాయణగుట్ట, వెలుగు: తల్వార్​తో హల్​చల్ చేస్తున్న ఒక యువకుడిని సౌత్ జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్రినాకకు చెందిన అజయ్ కుమార్(30) ఆన్​లైన్​లో తల్వార్ కొనుగోలు చేశాడు. దాంతో ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

అంతటితో ఆగకుండా ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీల్లో తల్వార్ తో కేక్​లు కట్ చేస్తూ హల్ చల్ చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో అజయ్​ను టాస్క్  ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని, ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.