లోటస్ పౌండ్ వద్దకు చేరుకున్న పోలీసులు.. షర్మిలను హౌస్ అరెస్టు చేసే ఛాన్స్

లోటస్ పౌండ్ వద్దకు చేరుకున్న పోలీసులు.. షర్మిలను హౌస్ అరెస్టు చేసే ఛాన్స్

లోటస్ పౌండ్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వైఎస్ షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా ముందస్తుగా షర్మిలను హౌస్ అరెస్టు చేయనున్నారు. పోలీసులు రావడంతో.. వైఎస్సార్ టీపీ కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. 

పాదయాత్రలో తమ వాహనాలపై దాడులకు నిరసనగా వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. పాదయాత్రలో ఉండగా.. వాహనాలపై దాడి చేసి.. తనను పోలీసులు అరెస్టు చేయడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి ఆమె సిద్ధమయ్యారు. దీంతో ఇటు లోటస్ పౌండ్.. అటు ప్రగతిభవన్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు.