కోడిపందాల స్థావరాలపై... పోలీసుల మెరుపు దాడి

కోడిపందాల స్థావరాలపై... పోలీసుల మెరుపు దాడి

కోడిపందాల స్థావరాలపై మణుగూరు పోలీసులు మెరుపుదాడి చేశారు. 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఆదివారం కావడంతో అటవీప్రాంతంలో రెండు స్థావరాలను ఏర్పాటుచేసుకుని భారీ స్థాయిలో పందేలు నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రేగులగండి అటవీప్రాంతంలో భారీ స్థాయిలో కోడిపందాలు ఆడుతున్న రెండు కోడిపందాల స్థావరాలపై మెరుపుదాడి చేశారు.రేగులగండి వద్ద కోడిపందాలు ఆడుతున్న సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా విస్తు పోయారు. తమ రాకతో చాలామంది అడవిలో పారిపోయారని పోలీసులు తెలిపారు.15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...45 మోటార్ సైకిళ్ళు,5 సైకిళ్ళు,15 కోడిపుంజులు,10 సెల్ ఫోన్లు, సుమారు 40 కోడికత్తులు, రూ, 32,250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు సి ఐ ముత్యం రమేశ్ తెలిపారు. కోడిపందాల స్థావరాల వద్ద అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు పట్టుబడడం ఇదే తొలిసారి.