పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్ట్

పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్ట్

పెద్దపల్లి జిల్లాలో పేకాట స్థావరాలపై దాడులు చేశారు పోలీసులు. ఈ దాడుల్లో భారీగా నగదు సెల్ ఫోన్లలను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏన్టీపీసీ జ్యోతి నగర్ లోని ఓ లాడ్జ్ లో పేకాట ఆడుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్ చేశారు. ఈ రైడ్ లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు పట్టున్నారు. 

వారి వద్ద రూ. 2 లక్ష 51 వేల నగదు, 7 సెల్ ఫోన్లను, 4 బైకులను, 1 ఫోర్ వీలర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పేకాట రాయుళ్లను ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.