పవన్ ను అడ్డుకున్న పోలీసులు.. జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

పవన్ ను అడ్డుకున్న పోలీసులు.. జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

అమరావతి: రాజధాని గ్రామాల్లో అరెస్టైన మహిళలు, రైతులను పరామర్శించేందుకు బయలు దేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు . అమరావతిలో 144 సెక్షన్ అమల్లోఉందని, రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు నాగబాబు పోలీసుల తీరుపై అభ్యం తరం వ్యక్తం చేశారు. పర్యటనకు వెళ్లితీరుతామని ఎవరు ఆపుతారో చూస్తామంటూ సవాల్ విసిరారు. దీంతో మంగళగిరిలోని జనసేన ఆఫీసు వద్ద పోలీసులు అదనపు బలగాలు మోహరించారు.పార్టీ పొలిటికల్ ఎఫైర్స్​ కమిటీ భేటీ ముగించుకుని బయటకు వచ్చిన పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు .అదే సమయంలో పవన్ కు వ్యతిరేకంగా కొంతమందిర్యాలీ చేపట్టారు. ప్యాకేజీ రాజకీయాలు మానుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో టెన్షన్ వాతావరణంనెలకొంది. జనసేన పార్టీ ఆఫీసు గేటుకు తాళం వేసిన పోలీసులు జనసేన కార్యకర్తలు, నేతలను అడ్డుకున్నారు.

రాజధాని పర్యటనకు అనుమతి లేదని కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పవన్ కు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..రాజధాని కోసం ధర్మపోరాటం చేస్తున్న మహిళలు,రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఆందోళనల్లో గాయపడిన రైతులను పరామర్శించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులను పరామర్శించి తీరుతానని పోలీసులతో అన్నారు . రాజధాని రైతులతో ఏపీ ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరించిందని విమర్శించారు. జనసేన పర్యటనను అడ్డుకుని వివాదం చేయెద్దని పోలీసులకు పవన్ సూచించారు. పోలీసులు పవన్ పర్యటనకు అనుమతించక పోవడంతో జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. అనుమతి లేకుండా పార్టీ ఆఫీసులోకి ఎలా వస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత పార్టీ ఆఫీసుకు చేరుకున్నఉన్నతాధికారులు రాజధానిలో పరిస్థుతులపై పవన్ కు  వివరించారు.

see more news ఏపీ అసెంబ్లీ ముట్టడికి యత్నం: మహిళలపై లాఠీచార్జ్