కిలో 50 వేలకు కొని తెచ్చి.. రూ. 4 లక్షలకు అమ్ముతుండు

కిలో 50 వేలకు కొని తెచ్చి.. రూ. 4 లక్షలకు అమ్ముతుండు

ఎల్బీ నగర్,వెలుగు: రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌‌‌‌లో అమ్ముతున్న సప్లయర్ ను ఎల్​బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన 4.2 కేజీల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులు తెలిపిన ప్రకారం..  రాజస్థాన్ కు చెందిన రమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (33) పదేళ్ల కింద నగరానికి వచ్చి స్టీల్ రైలింగ్ వర్క్ చేస్తున్నాడు.  

ఆదాయం సరిపోక ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆశపడ్డాడు.  దీంతో అతడికి పరిచయమైన డ్రగ్స్ సప్లయర్ రాజస్థాన్ కు చెందిన చెన్నారామ్ నుంచి కిలోకు రూ.50 వేలకు  డ్రగ్స్ కొనుగోలు చేసి సిటీలో కిలోకు రూ.4 లక్షల చొప్పున అమ్ముతున్నాడు. సమాచారం అందడంతో పోలీసులు రమేశ్ ను చైతన్యపురిలో అదుపులోకి తీసుకొని డ్రగ్స్ తో పాటు  కారు,మొబైల్స్,మిక్సర్స్ స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.