భూదాన్ బాధితులకు అండగా దీక్ష..విరమింపజేసిన పోలీసులు..తోపులాటలో పలువురికి గాయాలు

భూదాన్ బాధితులకు అండగా దీక్ష..విరమింపజేసిన పోలీసులు..తోపులాటలో పలువురికి గాయాలు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం అర్బన్  మండలం భూ దాన్  భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు సంఘీభావంగా ఆదివారం సిటీలోని అంబేద్కర్  భవనంలోని పునరావాస కేంద్రంలో హైదరాబాద్  యూనివర్సిటీ విద్యార్థి సంఘం లీడర్  రాజేశ్​ దత్త, తెలంగాణ బహుజన శక్తి పార్టీకి చెందిన రాజు దీక్ష చేపట్టారు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్  చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు దీక్షను విరమింపజేసేందుకు ప్ర యత్నించగా, బాధితులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు, బాధితుల మధ్య తోపులాట జరిగి పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీక్ష చేపట్టిన వారిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్తుండగా, బాధిత మహిళలు ఓల్డ్  బస్టాండ్  వద్ద ప్రధాన రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. వీరికి జనసేన నాయకులు మద్దతు తెలిపారు. రాజేశ్​దత్తతో దీక్ష విరమింపజేయగా, రాజు పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చి దీక్ష కొనసాగిస్తున్నాడు.