పోలీస్‌‌‌‌ అభ్యర్థులు: తప్పుల సవరణకు లాస్ట్ చాన్స్

పోలీస్‌‌‌‌ అభ్యర్థులు: తప్పుల సవరణకు లాస్ట్ చాన్స్

సర్టిఫికెట్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌కు వెళ్తున్న ‘పోలీస్‌‌‌‌’ అభ్యర్థులకు దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇచ్చారు. పోలీస్‌‌‌‌ శాఖలో 18,428 ఎస్‌‌‌‌ఐ, కానిస్టేబుల్‌‌‌‌ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటికే మెరిట్‌‌‌‌ జాబితా రిలీజ్‌‌‌‌ అయింది. సర్టిఫికెట్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌ మిగిలిఉంది. అయితే కొందరు దరఖాస్తు సమయంలో కొన్ని వివరాలు తప్పుగా నమోదు చేశారు. అలాంటి వాటిని సరిదిద్దుకునేందుకు నియామక మండలి అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల వివరాలను ఏ, బీ, సీ  కేటగిరీలుగా విభజించారు. ముందుగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికేషన్‍ క్యాంపులో అధికారులు ఎడిట్‌‌‌‌ చేస్తారు. ‘ఏ’  కేటగిరీల్లో ఉన్న వాటిని ఎడిట్‍ చేయాలంటే ఎస్సీ /ఎస్టీలు 3 వేలు, ఇతరులు 5 వేలు చెల్లించాలి. ‘బీ’ కేటగిరీలోని అంశాలను మార్చుకునేందుకు ఎస్సీ/ఎస్టీలు 2 వేలు, ఇతరులు 3 వేలు చెల్లించాలి. ఇక ‘సీ’ కేటగిరీ ఫీల్డ్‌‌‌‌లో మార్పులు చేసేందుకు వీలులేదు. జూన్‍ 4 ఉదయం 8 గంటల నుంచి 7న సాయంత్రం 8 గంటల వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఫీజు చెల్లించి ఎడిట్‌‌‌‌కు రిక్వెస్ట్‌‌‌‌ చేసుకోవాలి. ఆ ఫామ్‌‌‌‌ ఫ్రింట్‌‌‌‌ తీసుకుని సర్టిఫికేషన్‌‌‌‌ సమయంలో అధికారులు ఇస్తే వివరాలు ఎడిట్‌‌‌‌ చేస్తారు.

‘ఏ’ కేటగిరీలో అంశాలు

అభ్యర్థి పేరు, జెండర్‍, కమ్యూనిటీ, తెలంగాణ లోకల్‍ స్టేటస్‍, ఫొటో, సంతకం, ఆర్మీ/  నేవీ/ ఎయిర్‍ఫోర్స్ లలో ఎంప్లాయ్‌‌‌‌, ఎక్స్ సర్వీస్‍మెన్‍ కోటా.

‘బీ’లో ఎడిట్‍ చేసే అంశాలు

అభ్యర్థుల సర్‍నేమ్‍, ఆధార్‍ నంబర్‍, తండ్రి/ భర్త పేరు, తల్లి పేరు, బర్త్‌‌‌‌ డేట్‌‌‌‌, పుట్టు మచ్చలు, ఈ మెయిల్‍ ఐడీ,  జిల్లా లోకల్‍ స్టేటస్‍, క్రీమిలేయర్‍ వర్తింపు (బీసీలకు), తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి, ఎన్‍సీసీ ఇన్‍స్ట్రక్టర్‍, స్టడీ/రెసిడెన్స్ డిటైల్స్, స్పెషల్‍ కేటగిరీ డిటైల్స్(ఏసీసీ, సీపీపీ, ఎంఎస్పీ, సీడీఐ), ఎడ్యుకేషన్‍ క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్‍ అడ్రస్‍, అదర్‍ డిటైల్స్ (డ్రైవింగ్‍ లైసెన్స్)

‘సీ’లో పేర్కొన్న అంశాలు (ఎడిట్‍ అవకాశం లేదు)

– రిజిస్టర్డ్‌‌‌‌ ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌, (యూజర్‍ ఐడీ), పరీక్ష రాసే మీడియం, వయసు, పరీక్ష కేంద్రాల వివరాలు.