కరోనా రూల్స్ పాటించకుంటే పోలీస్​ కేసులు

కరోనా రూల్స్ పాటించకుంటే పోలీస్​ కేసులు

ముంబై: సిటీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో వైరస్​ కంట్రోల్​ కోసం బృహన్ ముంబై మున్సిపల్​ కార్పొరేషన్(బీఎంసీ) చర్యలు చేపట్టింది. గురువారం కొత్త గైడ్​లైన్స్​ జారీ చేసింది. వీటి అమలులో కఠినంగా ఉండనున్నట్లు పేర్కొంది. ఇకపైన ఎవరైనా కరోనా గైడ్​లైన్స్ ఉల్లంఘిస్తూ పట్టుబడితే ఏకంగా పోలీస్​ కేసు పెడతామని బీఎంసీ అధికారులు హెచ్చరించారు. సిటీలోని ఏ ఏరియాలోనైనా ఐదు, అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన బిల్డింగ్​ను సీల్​ చేస్తామని తెలిపారు. హోం క్వారెంటైన్​లో ఉన్నోళ్ల చేతిపై స్టాంప్​ వేస్తామని అన్నారు. మరోవైపు, సిటీలోని వేర్వేరు ఏరియాల్లో 300 మంది మార్షల్స్​ను నియమించి మాస్క్​ పెట్టుకోకుండా బయటికి వచ్చిన వాళ్ల నుంచి బీఎంసీ ఫైన్​ వసూలు చేపిస్తున్నట్లు వివరించారు. లోకల్​ ట్రైన్లలో మాస్క్​లేని ప్రయాణికులకు భారీగా ఫైన్​ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్​ ప్లేసుల్లో మాస్క్​ లేకుండా కనిపించిన వారిపై యాక్షన్​ తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లతో పాటు హోటళ్లు, ఆడిటోరియం, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో కరోనా గైడ్​లైన్స్ పాటిస్తున్నదీ లేనిదీ చెక్​ చేసేందుకు స్పెషల్​ టీమ్​లతో రైడ్ చేస్తామని బీఎంసీ అధికారులు చెప్పారు. కొత్త గైడ్​లైన్స్ ప్రకారం.. దేశంలోన ఇతర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే ప్రయాణికులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్లలో క్వారెంటైన్​ ఉండాలె. కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో టెస్టింగ్​ కెపాసిటీని ప్రభుత్వం పెంచుతోంది.