దుండగుల గ్రామం : ఈ ఊరికి వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి

దుండగుల గ్రామం : ఈ ఊరికి వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి

మీరు యూపీ వెళుతున్నారా.. అందులోనూ ముఖ్యంగా మధుర జిల్లాలోని హతియాకు వెళ్తున్నట్టయితే జాగ్రత్త. అక్కడ ఎవరైనా తక్కువ ధరకు ఏమైనా అమ్ముతామంటే నమ్మకండి. ఆ గ్రామంలో వెళ్లడానికి ముందు దగ్గర్లోని పోలీసుల అనుమతి తీసుకోండి. లేదంటే మీ పని గోవిందా.. ఇలా అని స్వయంగా అక్కడి పోలీసులే బోర్డులు పెట్టి మరీ చెబుతున్నారు.

యూపీలోని ఈ గ్రామంలో ప్రవేశించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. గ్రామాల దేశంగా ప్రసిద్ధి గాంచిన భారతదేశంలో.. చాలా గ్రామాలు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. అలాంటి గ్రామమే ఉత్తర్ ప్రదేశ్ లో ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే.. ప్రజలు ఇక్కడికి రావాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే. దానికి సంబంధించిన, నిబంధనలు గుర్తు చేస్తూ గ్రామానికి వెలువల పోలీసులు ఓ బోర్డు కూడా పెట్టారు. ఈ గ్రామం పేరు మధుర జిల్లాలో ఉన్న హథియా.

నిజానికి పోలీసులు ఈ గ్రామాన్ని దుండగుల గ్రామం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడి ప్రజలు తరతరాలుగా మోసంచేస్తున్నారు. అందుకే ఆ గ్రామానికి వెళ్లాలంటే ముందుకు పోలీసుల అనుమతి తీసుకున్నాకే గ్రామంలో ప్రవేశించాలనే నిబంధన పెట్టారు. ఇది ప్రస్తుతం బర్సానా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలోని ప్రజలు దేశవ్యాప్తంగా అనేక రకాల మోసాలు చేస్తున్నారు. అందుకే వీరిని హెచ్చరించే క్రమంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఊరి ప్రజలు బంగారు ఇటుకలని చెప్పి, ఇత్తడి ఇటుకలను, అమ్ముతుంటారు. తక్కువ ధరకు ఆర్‌ఓ ప్లాంట్లు, లిఫ్టులు, సీసీటీవీలు, జనరేటర్లు, భూములు అంటూ మోసం చేస్తుండడం ఇక్కడి ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే బయటి నుంచి వచ్చే ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. అనేక రాష్ట్రాలకు చెందిన పోలీసులు దాడులు చేసేందుకు ఈ గ్రామానికి వస్తూ ఉంటారు. అంతే కాదు ఇక్కడికి చెందిన వందలాది మంది దేశవ్యాప్తంగా వివిధ జైళ్లల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.