ఇంటికొచ్చి ఎఫ్​ఐఆర్​ రాస్తరు

ఇంటికొచ్చి ఎఫ్​ఐఆర్​ రాస్తరు

పీఎస్ కు రాకుండానే కంప్లయింట్ వ్వొచ్చు
హైదరాబాద్ లో ఈరోజు నుంచి కొత్త పద్ధతి

హైదరాబాద్, వెలుగు: ఇప్పటివరకు ఏదైనా కంప్లయింట్ ఇవ్వాలంటే బాధితులు తప్పనిసరిగా పోలీస్​స్టేషన్​కు వెళ్లాల్సి వచ్చేది. కొంతమంది బాధితులు కొన్ని కారణాలతో పోలీస్​స్టేషన్​దాకా వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఈ సమస్యకు ఒక  చక్కని పరిష్కారం చూపారు హైదరాబాద్ ​సిటీ పోలీసులు. ఏదైనా రీజన్స్​తో పీఎస్​కి రాలేకపోతే డయల్ 100, లేదా లోకల్​ పోలీస్​స్టేషన్​కు ఫోన్​ చేసి విషయం చెప్పొచ్చు. మీ ఏరియాలోని బ్లూ కోల్ట్స్ పోలీసులకు గాని, ప్యాట్రో కార్ సిబ్బందికి సమాచారమిచ్చినా ఇంటికి వచ్చి కంప్లయింట్​ తీసుకుంటారు. బాధితుడి ఇంటి నుంచే ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేయడం వల్ల నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కి చేరుతుంది. సంబంధిత ఇన్ స్పెక్టర్ కేసును పరిశీలించి ఫస్ట్​ ఇన్​ఫర్మేషన్​ రిపోర్ట్​ నమోదు చేస్తారు. అందులో నిజానిజాలను తెలుసుకుని కేసు దర్యాప్తుకు ఆదేశిస్తారు.  తీవ్రమైన నేరాల్లో సీన్ ఆఫ్ ఆఫెన్స్ ను విజిట్ చేసి స్టేట్​మెంట్స్ రికార్డ్ చేస్తారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్​కమిషనర్​అంజనీకుమార్​ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్​లో భాగంగా ఈ విధానాన్ని తెచ్చామన్నారు. 122 ప్యాట్రో కార్,400కి పైగా ఉన్న బ్లూకోల్ట్స్ సిబ్బందిని కేసులు నమోదు చేయించేందుకు రెడీ చేశామని తెలిపారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి