పాజిటివ్‌‌‌‌‌‌‌‌ టాక్‌‌‌‌‌‌‌‌ తో పోలీస్ కంప్లైంట్ మూవీ.. 

పాజిటివ్‌‌‌‌‌‌‌‌ టాక్‌‌‌‌‌‌‌‌ తో పోలీస్ కంప్లైంట్ మూవీ.. 

వరలక్ష్మీ  శరత్‌‌‌‌‌‌‌‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా  నిర్మించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’.  జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం  పాజిటివ్ టాక్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుందని టీమ్ చెప్పింది. 

ఈ సందర్భంగా సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌క్ష్మీ శ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌త్ కుమార్  వివాదంతో స‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌తం అయ్యాం.. చివ‌‌‌‌‌‌‌‌రికి విజ‌‌‌‌‌‌‌‌యంతో శుభం కార్డు ప‌‌‌‌‌‌‌‌డింద‌‌‌‌‌‌‌‌ని భావిస్తున్నాం.  విడుదలైన అన్ని కేంద్రాల్లో సినిమాకు మంచి స్పందన వస్తోంది. రెండ‌‌‌‌‌‌‌‌వ రోజు నుంచే థియేట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లు పెరుగుతున్నాయి’ అని చెప్పాడు. సినిమాకొస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్ని ఇస్తోందని నటుడు  కృష్ణ సాయి అన్నాడు.