వరంగల్‌ లో పోలీసుల విస్తృత తనిఖీలు

వరంగల్‌ లో పోలీసుల విస్తృత తనిఖీలు

ఖిలా వరంగల్ (మామునూర్), వెలుగు: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఓరుగల్లు కాకీలు అలర్ట్​ అయ్యారు. వరంగల్ కాజీపేట, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు ఆర్పీఎఫ్ జీ ఆర్ పీ సిబ్బంది సోదాలు చేపట్టారు. కాజీపేట, మిల్స్​కాలనీ సీఐలు సుధాకర్, బొల్లం రమేశ్​ ఆధ్వర్యంలో రైల్వే ప్లాట్ఫామ్స్, ప్రయాణికుల వేటింగ్ పార్సల్ విభాగం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ బృందంతో క్షుణ్ణంగా పరిశీలించారు.