తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో పోలీసుల సోదాలు

V6 Velugu Posted on Aug 03, 2021

తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో భారీ సంఖ్యలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యలో సోదాలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన తీన్మార్ మల్లన్న.. అసలు తనిఖీలు ఎందుకు చేస్తున్నారో కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. ప్రజా ప్రతినిధుల అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై కుట్రలు జరుగుతున్నాయని..ప్రభుత్వం ఎన్నికేసులు పెట్టినా భయపడబోనన్నారు. అంతేకాదు..ఇప్పటికే నాపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన వెనక్కి తగ్గేది లేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు తీన్మార్ మల్లన్న.

ఇటీవల జరిగిన నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు తీన్మార్ మల్లన్న.
 

Tagged Police Conduct raid, Teenmar Mallanna, Q News Office

Latest Videos

Subscribe Now

More News