కుత్బుల్లాపూర్లో కార్డెన్ సెర్చ్..రౌడీషీటర్ల ఇండ్లల్లో తనిఖీలు

కుత్బుల్లాపూర్లో కార్డెన్ సెర్చ్..రౌడీషీటర్ల ఇండ్లల్లో తనిఖీలు

కుత్బుల్లాపూర్ లోని సురారం కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మేడ్చల్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధికి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ,ఆరుగురు సీఐలు,12 మంది ఎస్ ఐలు,46 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల ఇండ్లను తనిఖీలు చేశారు. ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. అంతేకాదు.. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. 

మూడు బెల్ట్ షాపులను గుర్తించారు. బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి 153 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను కూడా తనిఖీలు చేశారు పోలీసులు. సరైన పత్రాలు లేని 42 బైకులు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది పాత నేరస్తులను, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సురారం కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో తిరిగినట్లు, కనిపించినట్లు అయితే.. తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.