హయత్​ నగర్​లో బర్త్​ డే పార్టీ.. సోదాల్లో గంజాయి లభ్యం

హయత్​ నగర్​లో బర్త్​ డే పార్టీ.. సోదాల్లో గంజాయి లభ్యం

హయత్నగర్  పసుమాములలో ఓ యువకుడి బర్త్​ డే పార్టీలో గంజాయి వినియోగం కలకలం సృష్టించింది.  ఓ యువకుడి బర్త్ డే పార్టీ సందర్భంగా పోలీసులు జరిపిన సోదాల్లో గంజాయి లభ్యమైంది. దీంతో అక్కడున్న  29 మంది యువకులు, నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​ కు తరలించారు. బర్త్​ డే పార్టీ జరిగిన ప్రదేశంలో 11 కార్లు, ఒక బైక్, 28మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల అదుపులో ఉన్న వారి తరఫున స్టేషన్​ కు వచ్చిన కుంట్లూర్ కి చెందిన మణికంఠ అనే యువకుడు హల్​ చల్​ చేశాడు. క్రైమ్​ ఇన్​స్పెక్టర్​ పై చేయి చేసుకొని నెట్టేశాడు. అక్కడ కవరేజీ చేస్తున్న మీడియా వారిని తిట్టాడు. క్రైమ్​ ఇన్​స్పెక్టర్​ ఫిర్యాదు మేరకు మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.