ఎల్బీ నగర్లో యువకుడిపై పోలీసుల ప్రతాపం.. చితకబాదడంతో వినపడని చెవి

ఎల్బీ నగర్లో యువకుడిపై పోలీసుల ప్రతాపం.. చితకబాదడంతో వినపడని చెవి

ఓ యువకుడిని అకారణంగా చితకబాదారు పోలీస్ కానిస్టేబుల్స్. ఎల్బీనగర్ లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశ్ అనే యువకుడు నిన్న ఓ ఫంక్షన్ కు హాజరై తిరిగి వస్తున్న  క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఓ ఆకతాయి హడావిడి చేస్తూ వెహికల్స్ ను ఆపుతూ హల్ చల్ చేశాడు. ఇదే విషయాన్ని సమీపంలో ఉన్న పోలీసులకు చెప్పేందుకు వెళ్లిన యువకుడిపైనే పోలీసుల ప్రతాపం చూపించారు.  లాటితో చావు దెబ్బలు కొట్టారు. ఇదేంటని సార్ అని అడిగితే చేతులతో చెవుపై గట్టిగా కొడుతూ దాడి చేశారు.  కొట్టొద్దు సార్ అని కాళ్ళ మీద పడ్డా వదలకు వాతలు వచ్చేటట్లు చావు దెబ్బలు కొట్టినట్లు బాధితుడు వాపోయాడు.

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లోనే యువకుడు ఫిర్యాదు చేశాడు. చెవిపై కొట్టడంతో అప్పటి నుంచి తన చెవి వినపడటం లేదని... తప్పును  కప్పి పుచ్చుకునేందుకు తనపైనే కేసులు పెడుతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.  అకారణంగా తనపై దాడి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.