మమతా సర్కార్ అనర్హులకు ప్రాధాన్యత ఇస్తుంది

మమతా సర్కార్ అనర్హులకు ప్రాధాన్యత ఇస్తుంది

వెస్ట్ బెంగాల్లోని కోల్కత్తాలో ఎడ్యుకేషన్  బోర్డు కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి  ఏర్పడింది. టెట్ క్వాలిఫై  అయిన అభ్యర్థులు అర్ధరాత్రి  నిరసనకు దిగారు.  2014లో తాము  టెట్ క్వాలిఫై అయ్యామని.. అయితే తమని మెరిట్ జాబితా నుంచి తొలగించారంటూ ఫైర్ అయ్యారు. మొత్తం  500 మంది అభ్యర్థులు నిరసనకు దిగారు. ఉద్రిక్త  పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. 

అభ్యర్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ ప్రాంతంలో పోలీసులు సెక్షన్  144 విధించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఉద్యోగ అపాయింట్మెంట్  లెటర్లు  అందించే  వరకు నిరసనలు చేస్తామని  టెట్ అభ్యర్థులు స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, అనర్హులకు ప్రాధాన్యత ఇస్తోందని వారు ఆరోపించారు. అక్టోబర్ 11న పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఈడీ అరెస్టు చేసింది.