సీఎం కేసీఆర్​ మెదక్​ పర్యటన.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సీఎం కేసీఆర్​ మెదక్​ పర్యటన.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సీఎం కేసీఆర్​ ఆగస్టు 23న మెదక్​ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వస్తుండగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్​ టికెట్టును ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్తూ మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్​రావు వర్గీయులు నిరసనలు తెలపడానికి నిర్ణయించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.  మైనం పల్లి రోహిత్​కి టికెట్​ కేటాయించాలని నేతలు డిమాండ్​ చేశారు.

రెవెన్యూ డివిజన్ పోరాట సమితి నేతల అరెస్ట్​..

సీఎం కేసీఆర్​ పర్యటన సందర్భంగా రామాయంపేట  రెవెన్యూ డివిజన్ పోరాట సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట ను రెవెన్యూ డివిజన్ చేయాలని 150 రోజులుగా వారు నిరసనలు తెలుపుతున్నారు. సీఎంకు తమ సమస్యను విన్నవించాలని వస్తే పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. డివిజన్​ ఏర్పాటు వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.