
తమిళ స్టార్ హీరో ధనుష్(Danush) పెద్ద కుమారుడు యాత్ర(Yatra)కు చెన్నై పోలీసులు జరిమానా విధించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ధనుష్ కుమారుడు యాత్రకు పోలీసులు ఎందుకు జరిమానా విదించారంటే.. ఇటీవల యాత్ర ఆర్ 15 బైక్ ను హెల్మెట్ లేకుండా నడుపుతూ కనిపించారు. ఇదంతా పక్కనే కారులో వెళ్తున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదికాస్తా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. నంబర్ ప్లేట్ ఆధారంగా హీరో ధనుష్ వెకిల్ అని తెలుసుకొని యాత్రకు వెయ్యి రూపాయల ఫైన్ వేశారు. యాత్ర బండి నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కెప్టెన్ మిల్లర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. 2024 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్.. ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.