ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఏ1గా ప్రభాకర్‌రావును చేర్చిన పోలీసులు

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఏ1గా ప్రభాకర్‌రావును చేర్చిన పోలీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1 గా చేర్చారు పోలీసులు.  ఈ కేసులో ఏ1 గా ప్రభాకర్ రావు, ఏ2 గా ప్రణీత్ రావు, ఏ3గా భుజంగరావు, ఏ5గా తిరుపతన్న, ఏ6 గా మరో వ్యక్తి పేరును చేర్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని.. ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్ లు ధ్వంసం చేశారని తెలిపారు. ప్రభాకర్ రావు చెప్పడంతో హార్డ్ డిస్క్ లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారని.. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్ ను రీట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ సెక్యూరిటీ వింగ్ అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ విషయం తెలిసిందే. ఎస్ ఐబీ డిఎస్పీ ప్రణీత్ రావు విచారణలో ఇచ్చి సమాచారం ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా 14 రోజుల రిమాండ విధించారు. అనంతరం వారిని చంచల్ గూడ జైలు కు తరలించారు.

భుజంగరావు ఎన్నికల ముందు వరకు పోలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ ఐబీ అదనపు ఎస్పీలుగా డ్యూటీలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ మీడియా శ్రవణ్ రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతి పక్ష పార్టీల ముఖ్యనేతలే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు గుర్తించారు.