పీఎం ఫొటోలు మార్ఫింగ్..షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

V6 Velugu Posted on Aug 17, 2020

హైదరాబాద్, వెలుగు: పీఎం నరేంద్ర మోడీని కించపరిచేలా ఉన్న పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. పాట్నాకు చెందిన ఒకరు మోడీ ఫొటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. నార్సింగికి చెందిన ఓ వ్యక్తి వాటిని షేర్ చేశాడు. స్థానిక బీజేపీ నేతల కంప్లయింట్ తో పోలీసులు ఆదివారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మార్ఫింగ్ చేసిన వ్య‌క్తిని పట్టుకోవాలంటూ కంప్లయింట్ కాపీని పాట్నా పోలీసులకు ట్రాన్స్ ఫ‌ర్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

 

Tagged arrest, Social media, photos

Latest Videos

Subscribe Now

More News