శోభాయాత్రకు 8 వేల మంది పోలీసులు.. 550 సీసీ కెమెరాలు

శోభాయాత్రకు 8 వేల మంది పోలీసులు.. 550 సీసీ కెమెరాలు

హైదరాబాద్,వెలుగు: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించే విజయ శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 8 వేల మంది పోలీసులు,550 సీసీటీవీ కెమెరాలు,4 మౌంటెడ్‌‌‌‌ కెమెరాలు,మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో సిటీ సీపీ ఆనంద్‌‌‌‌, ట్రాఫిక్ చీఫ్‌‌‌‌ ఏవీ రంగనాథ్‌‌‌‌ శుక్రవారం పర్యటించారు. గౌలిగూడ నుంచి తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు మొత్తం 12 కి.మీ సాగే యాత్రకు సంబంధించి రూట్​మ్యాప్‌‌‌‌ ను సమీక్షించారు.  ట్రాఫిక్ డైవర్షన్లు, బారికేడ్స్‌‌‌‌ ఏర్పాట్లను అధికారులతో కలిసి చర్చించారు. శోభాయాత్రను ప్రశాంతంగా పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచించారు. కరోనా ఎఫెక్ట్ తో రెండేళ్లుగా సిటీలో హనుమాన్ శోభాయాత్ర జరగలేదు. ఈ సారి కరోనా తీవ్రత తగ్గడంతో సిటీ, రాచకొండ కమిషనరేట్ల నుంచి రెండు శోభాయాత్ర ర్యాలీలను నిర్వహిస్తున్నారు.  నేటి ఉదయం 11 .30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి యాత్ర మొదలై రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ లోని తాండ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ముగియనుంది. ఇవే టైమింగ్స్ లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కర్మన్‌‌‌‌ఘాట్‌‌‌‌ హనుమాన్‌‌‌‌ టెంపుల్‌‌‌‌ నుంచి తాడ్‌‌‌‌బండ్‌‌‌‌ వరకు 21 కి.మీ మరో ర్యాలీ జరగనుంది. 

24 గంటల పాటు వైన్స్ బంద్

శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు జంటనగరాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ 3 కమిషనరేట్ల సీపీలు శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని వైన్స్‌‌‌‌ షాప్ లు, పబ్ లు,బార్లు,కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు  శోభాయాత్ర జరిగే ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్రలో పాల్గొనే వెహికల్స్ మినహా వేరేవాటిని శోభాయాత్రలోకి అనుతించమని సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ తెలిపారు.ప్రధాన శోభాయాత్రను పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘాలోకి తెచ్చామన్నారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించినట్లు చెప్పారు.

 ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

 అఫ్జల్ గంజ్,సాలార్ జంగ్ t నుంచి పుత్లిబౌలి వైపు వెహికల్స్ ను గౌలిగూడ చమాన్ మీదుగా సీబీఎస్ వైపు మళ్లించనున్నారు. ఆంధ్రా బ్యాంక్, రంగ్ మహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు వెహికల్స్ ను పుత్లిబౌలి క్రాస్ రోడ్స్ మీదుగా మళ్ళించనున్నారు. చాదర్ ఘాట్ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వెహికల్స్ ను సీబీఎస్ మీదుగా, అబిడ్స్ జీపీవో నుంచి వచ్చే ట్రాఫిక్ ను ఎంజే మార్కెట్ మీదుగా పంపుతారు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను బడేచౌడి,బర్కత్ పురా,టూరిస్ట్ హోటల్ మీదుగా మళ్లించనున్నారు.  ముషీరాబాద్ క్రాస్ రోడ్స్​ నుంచి వచ్చే ట్రాఫిక్​ను రాంనగర్ టి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. హిమాయత్ నగర్ జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్​ను  నారాయణగూడ ఫ్లై ఓవర్ మీదుగా కాచిగూడ వైపు దారి మళ్ళించనున్నారు.  లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ నుంచి వచ్చే  వెహికల్స్ ను డీబీఆర్ మిల్స్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్ళించనున్నారు.

సికింద్రాబాద్ రూట్​లో..

కర్బాల మైదాన్ నుంచి ఆర్పీ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్​ను ఎంజీ రోడ్, రాణిగంజ్ వైపు మళ్లించనున్నారు. బాపూజీ నగర్ నుంచి తాడ్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్​ను డైమండ్ పాయింట్ కార్ఖానా వైపు మళ్లించనున్నారు. మేడ్చల్, బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వెహికల్స్ ను  బాపూజీ నగర్, - బోయిన్ పల్లి మార్కెట్ వైపు మళ్లించనున్నారు.