గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో 10 మందిపై కేసు

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో 10 మందిపై కేసు

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో  పదిమందికి పైగా  కేసు నమోదు చేశారు పోలీసులు. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నట్లు మంజీరా గ్రూప్ డైరెక్టర్  వివేకనంద్ పోలీసుల విచారణలో అంగీకరించారు.   వ్యాపార వేత్తలు వివేకానంద్, అబ్బాస్ లపై కేసు నమోదు చేశారు. వివేకానంద్ అబ్బాస్ దగ్గర డ్రగ్స్ కొన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సేవించిన  నిర్భయ్ తో పాటు రఘు చరణ్, వ్యాపారవేత్తలు కేదార్ తో పాటు సందీప్, శ్వేతా , లిషి,నెయిల్, క్రిష్ ల పై కేసు నమోదు చేశారు. కొకైన్ ని పేపర్ లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో  మరికొంత మంది ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

 గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో    డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో   ఏస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. అప్పటికే డ్రగ్స్ తీసుకున్న వాళ్లు పారిపోయారు.  మంజీర గ్రూప్ డైరెక్టర్ జి. వివేకానంద్ పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్  ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు.