
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల బాలాజీ నగర్ లో జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలలో తల్వార్ తిప్పుతూ హల్చల్ చేసిన కొండల్ కత్తితో కేక్ కట్ చేశాడు. ఈ వీడియోలను కొండల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.
వీడియోల ఆధారంగా పోలీసులు మారణ ఆయుధాల చట్టం కింద కొండల్ ను అరెస్టు చేశారు ఎస్ ఓటీ పోలీసులు. విచారించిన అనంతరం కేసు జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు ఎస్వోటీ పోలీసులు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు జవహర్ నగర్ పోలీసులు .
ఇటీవల కొందరు రోడ్లపైన, పబ్లిక్ ప్లేసుల్లో బర్త్ డే వేడుకలు జరపుకుంటూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు.కొందరు గన్ లతో గాల్లో కాల్పులు జరుపుతున్న ఘటనలు కూడా జరిగాయి.