
నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లాలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నెక్కొండ టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా పర్మిషన్లు లేకుండా బెడ్స్ఏర్పాటు చేసి, ఎలాంటి అర్హతలు లేకుండా అల్లోపతి చికిత్స చేస్తున్న ముగ్గురిని ఫేక్ డాక్టర్లను మెడికల్ కౌన్సిల్ఆఫీసర్లు గత నెలలో చేసిన తనిఖీల్లో గుర్తించారు.
రిజిస్ట్రార్ లాలయ్య కుమార్, చైర్మన్ మహేశ్‌కుమార్ ఫిర్యాదుతో లావణ్య ఫస్ట్ఎయిడ్సెంటర్ నిర్వాహకుడు రమేశ్, రుద్రఫస్ట్ ఎయిడ్సెంటర్ నిర్వాహకుడు రవి, అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మెడికల్ కౌన్సిల్లో రిజిస్టేషన్ లేని వ్యక్తులు వైద్య సేవలు అందించరాదని, యాంటీ బయోటిక్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్, ల్యాబ్ టెస్టులు చేయడం, సైలెన్లు పెట్టడం చట్టారీత్యా నేరమని పేర్కొన్నారు. అలా చేసేవారిపై ఏడాది జైలుశిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తారని టీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్ కుమార్తెలిపారు.