సునీల్ డెడ్ బాడీ తరలించడంలో పోలీసుల హైడ్రామా

సునీల్ డెడ్ బాడీ తరలించడంలో పోలీసుల హైడ్రామా

మహబూబాబాద్ జిల్లా: ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం సూసైడ్ చేసుకున్న సునీల్ డెడ్ బాడీ తరలించడంలో పోలీసులు హై డ్రామా సృష్టిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, రాంసింగ్ తండాలో సునీల్ మృతదేహం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు బంధువులు.  పోలీస్ ఎస్కార్ట్ తో హైదరాబాద్ నుంచి అంబులెన్స్ లో బయలుదేరిన సునీల్ డెడ్ బాడీ.. డైరెక్టుగా గ్రామానికి తీసుకురాకుండా దారిమల్లిస్తున్నట్లు సమాచారం. ముందు నాలుగు.. వెనక 3..మొత్తం 7  పోలీస్ వాహనాలతో సూర్యాపేట వేపు తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు సునీల్ బంధువులు. సొంత గ్రామానికి తీసుకెళ్లకుండా ఇతర మార్గాల్లో తిప్పుతున్నారని, కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వడం లేదని సునీల్ సోదరుడు శ్రీనివాస్ బంధువులకు ఫోన్ ద్వారా తెలిపాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాంధీ హాస్పిటల్ నుండి పోస్ట్ మార్టం పూర్తవగానే అమరవీరుల స్థూపం దగ్గరకు తీసుకెళ్లాలని సునీల్ బంధువులు కోరినా .. పోలీసులు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీ భంద్రతతో డెడ్ బాడీని సునీల్ సొంత గ్రామానికి తరలిస్తామన్నారు. ప్రస్తుతం విద్యార్ధులు ఎక్కడ అడ్డుకుంటారోనని పోలీసులు పలు మార్గాల్లో సొంత ఇంటికి చేర్చనున్నట్లు తెలుస్తోంది. డెడ్ బాడీ త్వరగా ఇంటికి చేరకపోవడంతో సునీల్ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.