పార్టీలకు హాజరైన మోడల్స్ గురించి పోలీసుల ఆరా

పార్టీలకు హాజరైన మోడల్స్ గురించి పోలీసుల ఆరా
  • పార్టీలకు హాజరైన మోడల్స్ గురించి పోలీసుల ఆరా
  • కిరణ్  రాజ్ పై లుక్ ఔట్  నోటీసులు జారీ
  • పబ్ నిర్వాహకులను ప్రశ్నించడంపైనే పోలీసుల ఫోకస్

హైదరాబాద్: బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నైట్ అవర్స్ ఆఫ్టర్ పార్టీ పేరుతో పబ్ లో దందా కొనసాగించినట్లు గుర్తించారు పోలీసులు. వీకెండ్స్ డేస్ స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీకి అటెండ్ అయిన మోడల్స్ వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
సంచలం రేపిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్  కేసులో పోలీసుల దర్యాప్తు భిన్న కోణాల్లో నడుస్తోంది. కొకైన్ తెచ్చింది ఎవరు.. తీసుకుంది ఎవరు తేల్చుకోలేకపోతున్నారు పోలీసులు.  లేట్ నైట్ పార్టీలో పబ్ సిబ్బందితో కలిపి మొత్తం 145 మందికి పైగా ఉండటంతో వాళ్ళల్లో ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు. ఎవరు దాన్ని క్యారీ చేశారన్నది ఎస్టాబ్లిస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కస్టమర్లు బుక్ అయిన టేబుల్ ప్లేస్ లోనే ఉన్నారా?  పబ్ ఎంట్రీ రిజిస్టర్ లో వివరాలు.. ముంబై బేస్డ్ సాఫ్ట్ వేర్ ఫామ్ లో ఉన్న డిటేయిల్స్ లాంటివి పరిశీలించారు. అయినా డ్రగ్స్ లింక్ పై క్లారిటీ రావడం లేదు. 
ఇంకా అజ్ఞానంలోనే అర్జున్  వీరమాచినేని
పబ్ లో ఏం జరిగిందన్న దానిపై నిర్వాహకులకు మాత్రమే క్లారిటీ ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అర్జున్  వీరమాచినేని ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాడు. విదేశాల్లో ఉన్న కిరణ్  రాజ్  ఇండియాకు తిరిగి రాలేదు. దీంతో కిరణ్  రాజ్ పై లుక్ ఔట్  నోటీసులు జారీ చేశారు.  పార్టీలో ఆ రోజు పాల్గొన్న  కస్టమర్లను పోలీసు స్టేషన్ కు తరలించి వ్యక్తిగత వివరాలు సేకరించారు. అయితే ఎవరి శాంపుల్స్  కలెక్ట్  చేయలేదు. దీంతో పార్టీకి డ్రగ్స్  సప్లయ్  చేసినవారి  వివరాలు తెలిస్తే తప్ప ఆర్డర్   చేసిన కస్టమర్లు, దాన్ని తీసుకున్న వారి వివరాలు బయటికి వచ్చే అవకాశం లేదు. కోర్టులో ఎవిడెన్స్ ప్రూవ్ కాక పోతే ప్రారంభం దశలోనే కేసు నీరుగారి పోయే ఛాన్సెన్ ఉన్నాయి.
నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసుల నిర్ణయం
కేసులో ఎలాగైనా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయాలని భావిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే అరెస్టయిన నిందితులను కస్టడీకి కోరారు. అనిల్  కుమార్  , అభిషేక్  ఇచ్చే సమాచారంతో ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు కస్టమర్ల శాంపుల్స్  కలెక్ట్  చేయలేదు, కన్జూమర్స్  ఎవరో క్లారిటీకి రాలేదు. దీంతో పబ్ నిర్వాహకులను ప్రశ్నించడంపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. అందుకే నిందితులను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. పబ్  పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ కలెక్ట్ చేశారు. అనిల్ , అభిషేక్ ల ల్యాప్  టాప్ , మొబైల్ ఫోన్స్  డేటాను కోర్టుకు అప్పగించారు.
ఆఫ్టర్   పార్టీ పేరుతో గోవా, ముంబై నుంచి మోడల్స్ ను దింపి సెలబ్రేషన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా లేట్ నైట్ పార్టీలో లిక్కర్, ఫుడ్ , స్మోకింగ్ ని అన్ లిమిటెడ్ గా కస్టమర్లకు అందిస్తూనే.. పార్టీల మాటున ఇల్లీగల్ యాక్టీవిటీస్ జరిగినట్లు దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఆర్గనైజ్డ్ పార్టీలకు అటెండైన మోడల్స్ లిస్ట్ ఆధారంగా వివరాలు ఆరా తీస్తున్నారు. మెంబర్షిప్ లిస్టులో మాత్రం ధనవంతులు, సెలబ్రిటీల పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు లిస్టౌట్ చేశారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ సీనియర్లపై సోనియాకు అద్దంకి ఫిర్యాదు

ఎంజీఎంలో శాలరీస్..​ ప్రైవేట్‍ హాస్పిటల్స్​లో ప్రాక్టీస్