జనగామలో పోలీసుల ఓవరాక్షన్.. బీజేపీ నేతలపై లాఠీచార్జ్

జనగామలో పోలీసుల ఓవరాక్షన్.. బీజేపీ నేతలపై లాఠీచార్జ్

జనగామలో పోలీసులు రెచ్చిపోయారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. తాము చెప్పేది వినాలని బీజేపీ నాయకులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం చితకబాదారు పోలీసులు.  జనగామ పట్టణంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఉంచి, బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించారు మున్సిపల్ అధికారులు. దీంతో బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎలాంటి గొడవ జరగకపోయినా  సీఐ మల్లేశ్  ఒక్కసారిగా రెచ్చిపోయి బీజేపీ, బీజవైఎం నాయకులపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ గాయపడ్డారు.