హైదరాబాద్ సిటీలో.. ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయిన డాక్టర్ !

హైదరాబాద్ సిటీలో.. ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయిన డాక్టర్ !

హైదరాబాద్: ముషీరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఒక డాక్టర్ తన ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతున్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఇంట్లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్ జాన్ పాల్ను అరెస్ట్ చేశారు. 3 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ పాల్ ఇంట్లో STF బీ టీం సోదాలు చేసింది. ప్రమోద్, శరత్, సందీప్ అనే ముగ్గురు యువకులు.. బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించుకుని డాక్టర్ ఇంట్లో అమ్ముతున్నారు. డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పెట్టి తెలిసిన వారికి అమ్మకాలు జరిపినట్లు విచారణలో తేలింది. 

ఈ డ్రగ్స్ దందాలో డాక్టర్ తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ డాక్టర్ ప్రాణాంతకమైన డ్రగ్స్కు బానిస అయ్యాడని చెప్పారు. డ్రగ్స్ కొనాలంటే తన దగ్గర తగినంత డబ్బు లేదని ముగ్గురు స్నేహితులతో డ్రగ్స్ వ్యాపారంలో పాలు పంచుకున్నాడు.

ఢిల్లీ, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్ను తన ఇంట్లో పెట్టుకుని అమ్మకాలు సాగిస్తూ.. ఎక్సైజ్ STF బీ టీంకు జాన్ పాల్ అనే పీజీ చదువుతున్న ఈ డాక్టర్ పట్టుబడ్డాడు. ఈ డ్రగ్స్ అమ్మకాలు తన ఇంటి నుంచి చేసినందుకు తన దగ్గర ఉన్న డ్రగ్స్ను తాను ఉచితంగా వాడుకుంటూ డాక్టర్ జాన్ పాల్ అమ్మకాలు జరుపుతున్నట్లు STF టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎస్.ఐ బాలరాజు, కానిస్టేబుల్ విజయ్ కృష్ణ సిబ్బందులు కలిసి డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. 

ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 26.95 గ్రాముల ఓజి కుష్, 6.21 గ్రాముల ఎండిఎంఎ, 15 ఎల్ ఎస్ డి బాస్ట్స్, 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాసిస్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తెప్పిస్తున్న ప్రమోద్, సందీప్, శరతులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై కూడా కేసు నమోదు చేశారు. ఒక డాక్టర్ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం పట్ల ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం పోలీసులను అభినందించారు.