అక్రమంగా కత్తులు అమ్ముతున్న తండ్రీ కొడుకుల అరెస్ట్​

అక్రమంగా కత్తులు అమ్ముతున్న తండ్రీ కొడుకుల అరెస్ట్​

పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లను సద్వినియోగం చేసుకోవాలని భావించి పదునైన కత్తులు, బాకులు అక్రమంగా విక్రయిస్తున్న తండ్రీకొడుకులను బోయిన్​పల్లి పోలీసులతో కలిసి  టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 53 ఏళ్ల వినయ్ శర్మ కొలారియా, 23 ఏళ్ల ఆకాష్ కొలారియా ఇద్దరు ఆయుధాలు అమ్మి జీవిస్తున్నారు. 

ALSO READ :కుక్కను కరిచిన మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు..

కత్తుల రకాలను బట్టి రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు ధర నిర్ణయించి అమ్మేవారు. సమాచారం అందుకున్న పోలీసులు వీళ్ల స్థావరాలపై దాడి చేసి..  నిందితుల నుంచి మూడు కత్తులు, ఒక బాకు, నాలుగు ఇమిటేషన్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  బోయిన్‌పల్లిలో జేసీ క్రాఫ్ట్స్ పేరుతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వినయ్ వ్యాపారం లాభసాటిగా మారడంతో దీన్ని జీవనాధారంగా చేసుకున్నారు.