ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు

 ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్  ప్రభాకర్ రావు ఇండియాకు రప్పించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న పలువురు అధికారులను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుతోపాటు ఓ చానల్ ఎండీ శ్రవణ్ రావును భారత్ కు రప్పించేందుకు అన్నిక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను పోలీసులు సేకరించారు. కొండాపూర్ లోని కన్వర్జెన్స్ ఇన్నేవేషన్ ల్యాబ్ లో సోదాలు చేసి, 3 సర్వర్లు, హార్డ్ డిస్క్ లు, 5 మాక్ మినీ డివైజ్ లు సీజ్ చేశారు. ల్యాబ్ డైరెక్టర్ పాల్ రవికుమార్ కు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. ఆయనతో పాటు ల్యాబ్ సీనియర్ మేనేజర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్టేట్ మెంట్స్ రికార్డ్ చేశారు.