పటాన్ చెరులో కోళ్లపందాలు..పరారీలో మాజీ ఎమ్మెల్యే

పటాన్ చెరులో కోళ్లపందాలు..పరారీలో మాజీ ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కోళ్ల పందాల స్థావరంపై పోలీసులు బుధవారం రాత్రి దాడి చేశారు. 100 కోళ్లు, రూ.13 లక్షలు, 26 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 21 మందిని అరెస్ట్ చేశారు. పటాన్ చెరు డీఎస్పీ భీంరెడ్డి నేతృత్వంలో సోదాలు చేశారు. పటాన్ చెరు మండలం పెద్ద కంజర్ల శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆయా స్థావరాలపై పోలీసులు దాడి చేయగా ఆ టైమలో అక్కడున్న  టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  పారిపోయినట్లు తెలిసింది. పరారైన మాజీ ఎమ్మెల్యే తో పాటు ఇతర ప్రముఖుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు .ఇదిలా ఉండగా చింతమనేని ప్రభాకర్ కొంత కాలంగా పెద్ద కంజర్ల సమీపంలోని ఓఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.