ఫామ్ హౌస్​పై దాడి.. నలుగురి అరెస్ట్

ఫామ్ హౌస్​పై దాడి.. నలుగురి అరెస్ట్

ఘట్ కేసర్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఫామ్ హౌస్​పై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. ఘట్ కేసర్ ఠాణా పరిధి ఔషాపూర్ లోని కాంటినెంట్ ఫామ్ హౌస్​లో న్యూసెన్స్ సృష్టిస్తున్నారని స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. 

ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పలువురు మద్యం, హుక్కా ను సేవిస్తుండడంతో.. నిర్వాహకులు సౌరవ్ గుప్తా(36), నాగరాజు రాజా(28), ఫామ్ హౌస్ యజమాని ఆకాష్ గుప్తా,  మేనేజర్ సరోజ్​ను అరెస్టు చేశారు. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడ్మిన్ ఎస్సై రాము నాయక్ హెచ్చరించారు.