ఇంటిని ఆక్రమించి 70 లక్షలు డిమాండ్.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంటిని ఆక్రమించి 70 లక్షలు డిమాండ్.. కేసు నమోదు చేసిన పోలీసులు

జూబ్లీహిల్స్, వెలుగు: ఓ ఇంటిని ఆక్రమించి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యడ్లపల్లి నిర్మలాదేవి, యడ్లపల్లి వెంకటేశ్వర్లు దంపతులు యూసఫ్ గూడ చెక్ పోస్ట్  తాహెర్ విల్లాలో నివసిస్తున్నారు. వీరికి సాయి సారధి నగర్ ఎల్లారెడ్డిగూడలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది.

ఆ ఇంట్లోకి మోతినగర్ ప్రాంతానికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి చొరబడి ఆక్రమించుకున్నాడు. ఖాళీ చేయాలంటే తనకు రూ.70 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇంటి యజమానులపై చంపుతానని బెదిరించారు. దీంతో నిర్మలాదేవి మధురానగర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.