ప్రజల కోసం ప్రగతిభవన్..కంచెలు తొలగిస్తున్న పోలీసులు

ప్రజల కోసం ప్రగతిభవన్..కంచెలు తొలగిస్తున్న పోలీసులు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రగతిభవన్ దగ్గర ఆంక్షలుఎత్తేశారు. పదేళ్లుగా ప్రగతి భవన్ ముందున్న కంచెలు తొలగించారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో స్పష్టత రాగానే.. సెక్రటేరియట్, ప్రగతిభవన్  గురించి ప్రస్తావించారు రేవంత్ రెడ్డి.  మాపాలనలో సెక్రటేరియట్, ప్రగతిభవన్ తలుపులు ప్రజలకోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయని ప్రకటించారు. ప్రగతిభవన్ పేరును  డా. అంబేద్కర్ ప్రజాభవన్గా పేరు మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా చర్యలు ఆ దిశగా చర్యలు చేప్టటారు పోలీసులు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రగతిభవన్కు ఈ కంచె ఏర్పాటు చేశారు. ధర్నాలు, ఆందోళనలు అడ్డుకునేందుకు ఈ కంచె ఏర్పాటు చేశారని అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజలనుంచి ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు నిర్భయంగా ప్రగతిభవన్కు రావొచ్చని..తమ ఫిర్యాదులను సీఎంకు విన్నవించేందుకు స్వేచ్ఛ ఉందని తెలిపేందుకే  కంచె తొలగింపు అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. కంచెను తొలగిస్తే ఇక్కడ ఆ ప్రాంతం వెళ్లే వాహన దారులకు కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉందటున్నారు.