ఏడుపాయలలో నీటిలో పడిన చిన్నారిని  కాపాడిన పోలీసులు

 ఏడుపాయలలో నీటిలో పడిన చిన్నారిని  కాపాడిన పోలీసులు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో ఆదివారం చెక్ డ్యామ్ దగ్గర భక్తులు స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నీటిలో జారి పడింది. గమనించిన క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్టీ) ఇన్​చార్జి శ్రీనివాస్, కానిస్టేబుల్స్ యాదగిరి, రాజేందర్ వెంటనే స్పందించి చెక్ డ్యామ్ లోకి దిగి చిన్నారి ప్రాణాలు కాపాడారు.  

అలాగే ఏడుపాయల దుర్గామాత ఆలయం ఆవరణలో లలిత్ గౌడ్ అనే 4 ఏళ్ల బాలుడు తప్పిపోయి అటు ఇటు తిరుగుతుండగా గమనించిన పోలీసులు బాలుడిని తల్లితండ్రులకు అప్పగించారు.