హైదరాబాద్ ఓల్డ్సిటీలో ఆంక్షలు 

 హైదరాబాద్ ఓల్డ్సిటీలో ఆంక్షలు 
  • పాతబస్తీ మొత్తం రాపిడ్ యాక్షన్ ఫోర్స్తో నిఘా
  • పాత బస్తీ వైపు వచ్చే వాహనాల దారి మళ్లింపు 

హైదరాబాద్: పాతబస్తీలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు పోలీసుల బలగాలను  భారీ సంఖ్యలో మొహరించారు. రాత్రి 7 గంటలకల్లా వ్యాపారాలు, దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. పాతబస్తీవైపు వచ్చే వాహనాలన్నీ దారి మళ్లించారు. చార్మినార్, శాలిబండ, మొఘల్ పురాలో దుకాణాలు, హోటళ్లను మూసివేయించారు. ఈస్ట్ జోన్, సౌత్ జోన్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాతబస్తీ మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలను మొహరించారు. రోడ్లపై నిరసనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

పాతబస్తీలో ఆంక్షలు.. ట్రాఫిక్ మళ్లింపు..

ప్రస్తుతం ఉన్న లాండ్ అండ్ ఆర్డర్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దృష్ట్యా సాధారణ ట్రాఫిక్ అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. పాతబస్తీలో రాత్రి 7 గంటలకు వ్యాపారాలన్నీ మూసివేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు నిర్ణయం తీసుకున్నారు. 

ఓల్డ్ సిటీ, మలక్‌పేట్ మరియు ఎల్‌బి నగర్ వైపు వెళ్లాలంటే..

ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను 100 అడుగుల రోడ్డు, జియాగూడ, రాంసింగ్‌పురా, అత్తాపూర్, ఆరామ్‌గఢ్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తారు.


ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా పాతబస్తీకి వెళ్లే ట్రాఫిక్‌ను రంగమహల్, చాదర్‌ఘాట్, నింబోలియాడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్‌పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక వైపు మళ్లిస్తారు.


అబిడ్స్‌, కోఠి వైపు నుంచి చాదర్‌ఘాట్‌ వంతెన, చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే, మూసారాంబాగ్‌ వంతెన మీదుగా మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను నింబోలియాడ్డ, టూరిస్ట్‌ జంక్షన్‌, బర్కత్‌పురా, ఫీవర్‌ హాస్పిటల్‌, విద్యానగర్‌, తార్నాక లేదా 6 నంబర్‌ జూ., రామంతాపూర్‌ వైపు మళ్లిస్తారు.


పాతబస్తీ నుంచి నయాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి మీదుగా అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, లక్డీకాపూల్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తారు. 
చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరామ్‌గఢ్, అత్తాపూర్, మెహదీపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలి.

దిల్‌సుఖ్‌నగర్ మరియు ఎల్‌బి నగర్ నుండి మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, ఎస్‌జె బ్రిడ్జ్ మీదుగా అబిడ్స్, కోటి, ఎంజె మార్కెట్ వైపు వెళ్లే ట్రాఫిక్ ఉప్పల్, తార్నాక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పురా నుండి వెళ్లాలి.

వినాయక విగ్రహాలు వెళ్లాల్సిన రూట్లు

మంగళహాట్/గోషామహల్ ప్రాంతాల నుండి సౌత్ జోన్/తెలంగాణలోని ఇతర జిల్లాలకు తరలివెళ్లే గణేష్ విగ్రహాలు క్రింది మార్గాల్లో వెళ్లాలని సూచించారు:

పాతబస్తీ వైపు విగ్రహాలు 100 అడుగుల రోడ్డు, జియాగూడ, రాంసింగ్‌పురా, అత్తాపూర్, ఆరామగఢ్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట మీదుగా పాతబస్తీలోకి ప్రవేశిస్తాయి.

అఫ్జల్‌గంజ్, సిబిఎస్, రాగ్‌మహల్, చాదర్‌ఘాట్, నింబోలియాడ్డ, బర్కత్‌పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తనకా, హబ్సిగూడ ఉప్పల్, ఎల్‌బి నగర్ మీదుగా ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ & ఎల్‌బి నగర్ వైపు విగ్రహాలు వెళ్తాయి.

నగర పౌరులందరూ ట్రాఫిక్ మళ్లింపును గమనించి సహకరించాలని  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.