కామారెడ్డి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

 కామారెడ్డి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

లింగంపేట, వెలుగు:  వ్యవసాయ భూమిలో బండరాళ్ల​ పేల్చివేతకు అమర్చిన 31 జిలెటిన్ స్టిక్స్ కామారెడ్డి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండరాళ్లను పేల్చే ట్రాక్టర్​ కంప్రెషర్​ను  సీజ్​చేశారు. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట మండలం భవానీపేట శివారులోని దర్శనం సాయిలుకు చెందిన వ్యవసాయ భూమిలోని బండరాళ్లను జిలెటిన్ స్టిక్స్ తో ఆదివారం పేల్చివేశారు. బండరాళ్లు ఎగిరిపడి గ్రామానికి చెందిన బిట్ల పోశెట్టి, ఆర్ల పోచయ్య,బిట్ల సాయిలు ఇండ్లు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు బైక్​ ధ్వంసమైంది. 

  పోలీసులకు సమాచారం అందించడంతో  ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​రావు, సీఐ రవీందర్​నాయక్, లింగంపేట ఎస్ఐ వెంకట్​రావు సోమవారం భూమి వద్దకు బాంబ్, డాగ్​స్వ్కాడ్​సిబ్బందితో వెళ్లి తనిఖీ చేపట్టారు. బండరాళ్లలో అమర్చిన జిలెటిన్ స్టిక్స్ ను గుర్తించి​ నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకోగా..  భవానీపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.