ప్యాకింగ్ కవర్లో గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ పోర్టులో సీజ్

ప్యాకింగ్ కవర్లో  గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ పోర్టులో సీజ్

ప్యాకింగ్ కవర్ల లోపలి పొరల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా శంషాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. 1.026 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ. 47లక్షల 63వేల రూపాయలు ఉంటుందని చెప్పారు. దుబాయ్ నుంచి విమానంలో శంషాబాద్ కు వచ్చిన అనుమానిత వ్యక్తిని పోలీసులు తనిఖీ చేశారు. బంగారాన్ని రేకులుగా చేసి.. ప్యాకింగ్ కవర్ల లోపలి పొరల్లో దాచి తీసుకురావడం గుర్తించి సీజ్ చేశారు. కవర్లు తీసుకుంటున్న మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.