పంజాబ్లోని పోలీస్ స్టేషన్పై రాకెట్ గ్రెనేడ్‌తో దాడి

పంజాబ్లోని పోలీస్ స్టేషన్పై రాకెట్ గ్రెనేడ్‌తో దాడి

పంజాబ్లోని ఓ పోలీస్ స్టేషన్పై రాకెట్ లాంచర్ తరహా దాడి జరిగింది. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో తర్న్ తరణ్లోని సర్హాలి పోలీస్ స్టేషన్ లక్ష్యంగా దుండగులు దాడి జరిపారు. ఈ ఘటనలో రాకెట్ గ్రానైట్ పోలీస్ స్టేషన్ బయటి పిల్లర్కు తలిగింది. 

దుండగుల దాడిలో పోలీస్ స్టేషన్‌ స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ఈ పోలీస్ స్టేషన్‌లో 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాడిపై స్పందించిన బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ అరాచక పాలన వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించింది.

పాకిస్తాన్‌లో మరణించిన్నట్లు భావిస్తున్న ఖలిస్తాని ఉగ్రవాది హర్విందర్‌ సింగ్‌ రిండా స్వస్థలం కూడా సర్హాలినే. రిండా నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కి చెందిన సభ్యుడు. అతనిపై ఈ ఏడాది మేలో పంజాబ్‌ పోలీసు ఇంటెలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌పై ఆర్‌పీజీ దాడితో సహా పలు ఉగ్రవాద కేసులు ఉన్నాయి.