సీపీఐ నారాయణను అడ్డుకున్న పోలీసులు

సీపీఐ  నారాయణను అడ్డుకున్న పోలీసులు

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించడానికి బాసర క్యాంపస్ కు వెళ్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులతో మాట్లాడానికి కూడా వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు నారాయణ. బాసర ట్రిపుల్ లోకి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్ష నేతలను కూడా వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ప్రైవేటు సామ్రాజ్యమా, పాకిస్థానా, టెర్రరిస్ట్ క్యాంపా అని ప్రశ్నించారు నారాయణ.