అటు నిమజ్జనం.. ఇటు మిలాద్​ ఉన్ ​నబీ.. సోషల్ ​మీడియా గ్రూప్స్​పై పోలీస్​ నిఘా

అటు నిమజ్జనం.. ఇటు మిలాద్​ ఉన్ ​నబీ.. సోషల్ ​మీడియా గ్రూప్స్​పై పోలీస్​ నిఘా
  • రెచ్చగొట్టే కంటెంట్, మార్ఫింగ్‌‌‌‌ ఫొటోలు, వీడియోలు పోస్ట్​చేస్తే యాక్షన్​
  • ఫోన్‌‌‌‌ నంబర్ల ఆధారంగాక్రియేటర్స్ గుర్తింపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీలో గణపతి నవరాత్రులు, మిలాద్ ఉన్‌‌‌‌ నబీ, ఇతర రాజకీయ ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోషల్​మీడియాపై నజర్ పెట్టారు. ఇంటిగ్రేటెడ్  సోషల్ మీడియా సర్వేలెన్స్​వింగ్‌‌‌‌, సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్‌‌‌‌(స్మాష్)తో మానిటర్​చేస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్​అయ్యే అన్ని రకాల పోస్టులను గమనిస్తున్నారు.  ఇందుకోసం బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ సెల్‌‌‌‌ ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టే కంటెంట్, మార్ఫింగ్‌‌‌‌ ఫొటోలు, వీడియోలు పోస్ట్​చేసేవారిని గుర్తించనున్నారు. 

ఇప్పటికే భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి, ఖైరతాబాద్‌‌‌‌ గణేశ్​ఉత్సవ సమితి నిర్వాహకులు, పీస్ కమిటీల సభ్యులతో పోలీసులు  సమావేశాలు నిర్వహించారు. ఓల్డ్‌‌‌‌ సిటీ సహా అన్ని ప్రాంతాల్లోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌‌‌‌ ఇచ్చారు. కొంత మందిని బైండోవర్ చేశారు. పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న మండప నిర్వాహకులతో మాట్లాడుతూ వారి గ్రూప్స్‌‌‌‌లో ఎలాంటి పోస్టింగ్స్ వచ్చినా సమాచారం తీసుకుంటున్నారు. ఫేక్‌‌‌‌ న్యూస్‌‌‌‌ ప్రచారం చేసే వారి ఫోన్‌‌‌‌ నంబర్ల ఆధారంగా కంటెంట్​క్రియేటర్లను గుర్తించనున్నారు. సోషల్‌‌‌‌ మీడియా ప్లాట్​ఫామ్స్ లో వచ్చే ప్రతి పోస్టును స్క్రూటినీ చేస్తున్నారు.