
పెద్ద గోల్కొండ టోల్ గేట్ వద్ద హీరో రాజశేఖర్ కారు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. హీరో రాజశేఖర్ TS 07FZ 1234 నెంబర్ గల బెంజ్ కారులో ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. రాజశేఖర్ స్వయంగా కారును వేగంగా నడుపుతూ, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో హీరో రాజశేఖర్‌కి చిన్నపాటి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ORR నుండి కారును పోలీస్ స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.