
వాంటెడ్, సస్పెక్ట్ వెహికల్స్ డేటాతో లిస్ట్ ప్రిపేర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలర్స్ట్
ట్రాకింగ్ కోసం సిటీ పరిధిలో స్పెషల్ టీమ్
హైదరాబాద్,వెలుగు: క్రైమ్ ప్రివెన్షన్‌లో పోలీసులు స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్)తో కనెక్ట్ చేసిన టెక్నాలజీతో వెహికల్స్ ను ట్రాక్ చేస్తున్నారు. ఇందుకోసం పోలీసులు ‘హాట్‌లిస్ట్’ పేరుతో నంబర్ ప్లేట్స్ డేటాను ప్రిపేర్ చేశారు. క్రైమ్ బ్యూరో రికార్డ్స్ అందించే డేటా ఆధారంగా సస్పెక్ట్,వాంటెడ్.ఫేక్ నంబర్ ప్లేట్ వెహికల్స్‌ను ట్రేస్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ అందించే అలర్ట్స్‌తో హాట్‌లిస్ట్ వెహికల్స్‌ను ఛేజ్ చేసి పట్టుకుంటున్నారు. వెహికల్ నంబర్ ట్రాకింగ్ కోసం సిటీ కమిషనరేట్‌లో స్పెషల్ టీమ్ వర్క్ చేస్తోంది. ఐదుగురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను హాట్‌లిస్ట్ వెహికల్స్‌ను గుర్తించేందుకు ఏర్పాటు చేశారు. హాట్ లిస్ట్ వెహికల్స్ నంబర్స్ డేటాను ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్(ఏఎన్‌పీఆర్) సిస్టమ్‌తో కనెక్ట్ చేశారు. దీంతో సీసీటీఎన్‌ఎస్, మూడు కమిషనరేట్ల లిమిట్స్‌లో రిజిస్టరైన ఫేక్ నంబర్ ప్లేట్స్ వెహికిల్స్‌ను ఐడెంటిఫై చేస్తున్నారు. సీసీఆర్‌బీ, సోషల్‌మీడియా నుంచి అందిన కంప్లయింట్స్‌తో పోలీసులు హాట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు.
టీఎస్‌కాప్ యాప్‌లో డేటా అప్‌డేట్
టీఎస్‌కాప్ యాప్‌లో హాట్‌లిస్ట్ వెహికల్ డేటా అప్‌డేట్ అవుతుంటుంది. దీంతో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హాట్‌లిస్ట్ వెహికల్స్‌ను పోలీసులు అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలో హాట్‌లిస్ట్‌లో రిజిస్టరైన వెహికల్స్‌ను సీసీటీవీ కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి. వాటినుంచి ఏఎన్‌పీఆర్ సిస్టమ్ పాప్ అప్‌తో అలర్ట్ ఇస్తుంది. దీంతో హాట్‌లిస్ట్ వెహికల్స్ మూవ్‌మెంట్స్‌ను సంబంధిత పోలీసులకు అందిస్తారు. జంక్షన్‌ను ట్రాక్ చేస్తూ వెంటాడుతారు. ఛేజ్ చేసిన వెహికల్స్‌ను డిటైన్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇలా గతేడాది సుమారు 1300 వెహికల్స్ డేటాను సిటీ పోలీసులు ప్రిపేర్ చేశారు. ఇందులో 250 సస్పెక్ట్ వెహికల్స్‌ను ట్రేస్ చేశారు.
ప్రూఫ్స్ లేకపోతే తుక్కు కిందే లెక్క
ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ పోలీసుల వెహికల్ చెకింగ్‌లో ఫేక్ నంబర్ ప్లేట్స్‌ను గుర్తిస్తున్నారు. ఇందులో ఎక్కువగా ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు వెహికల్ నంబర్ ట్యాంపర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నంబర్ ప్లేటును డ్యామేజ్ చేయడం లేదా నంబర్స్ చెరిపేసిన వెహికల్స్‌ను హాట్‌లిస్ట్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నారు.అలాంటి వెహికల్స్ వాడిన వాహనదారులపై ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. వెహికల్స్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వెహికల్స్‌ను కోర్టు అనుమతితో వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తున్నారు.