భగవత్ వ్యాఖ్యలపై దుమారం..మోదీని ఉద్దేశించే అన్నారని ప్రతిపక్ష నేతల కామెంట్లు

భగవత్ వ్యాఖ్యలపై దుమారం..మోదీని ఉద్దేశించే అన్నారని ప్రతిపక్ష నేతల కామెంట్లు
  • 75 ఏండ్ల తర్వాత ఎవరైనా తప్పుకోవాలన్న ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ చీఫ్ 

న్యూఢిల్లీ: 75 ఏండ్లు పూర్తయిన నాయకులందరూ రిటైర్మెంట్ తీసుకుని, కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతున్నది. ఆయన ప్రధాని మోదీని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘పలు అవార్డులు తీసుకుని విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్న ప్రధాని మోదీకి ఎలాంటి స్వాగతం లభిస్తున్నదో చూడండి. 

ఈ ఏడాది సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏండ్లు పూర్తవుతాయని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుర్తు చేస్తున్నారు. కానీ భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 11న 75 ఏండ్లు పూర్తవుతాయని మోదీ గుర్తు చేయాలి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు” అంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో శుక్రవారం పోస్టు పెట్టారు. ‘‘గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్.. వచ్చే సెప్టెంబర్ 11న భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, 17న ప్రధాని మోదీకి 75 ఏండ్లు పూర్తవుతాయి.

 ఇక దేశానికి, రాజ్యాంగానికి మంచి రోజులు వస్తాయి. చాలా ఆనందంగా ఉంది” అంటూ కాంగ్రెస్ మీడియా సెల్ హెడ్ పవన్ ఖేరా పోస్టు పెట్టారు. ‘‘ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జశ్వంత్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 75 ఏండ్లు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ వాళ్లను బలవంతంగా బయటకు పంపించారు. మరి అదే రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయనకూ వర్తిస్తుందా? లేదా? వేచి చూడాలి!” అంటూ శివసేన (యూబీటీ) లీడర్ సంజయ్ రౌత్ పోస్టు పెట్టారు.  

భగవత్ ఏమన్నారంటే?

 నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. ‘‘మనకు 75 ఏండ్లు పూర్తయిన తర్వాత శాలువా కప్పి గౌరవించారంటే.. ఇక పక్కకు ఉండమని అర్థం. 75 ఏండ్ల తర్వాత ప్రతి ఒక్కరూ తప్పుకుని, కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి” అని పేర్కొన్నారు.