ఒక్కో పార్టీ కార్యకర్తకు రోజుకు రూ.1000 వరకు ఖర్చు

ఒక్కో పార్టీ కార్యకర్తకు రోజుకు రూ.1000 వరకు ఖర్చు

సిటీలో ఎన్నికల వేడి క్రమంగా ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీలు సహా ఇతర పార్టీల నేతలు ప్రచారంలోకి దిగారు. తమ వెంట ఉంటూ జెండాలు మోయడమే గాక జేజేలు పలికే కార్యకర్తలు, అనుచరులకు ఉదయం టిఫెన్‍, మధ్యాహ్నం , రాత్రి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్య మధ్యలో మంచినీరు, చాయ్ లు అదనం. ఒక్కో కార్యకర్త కోసం అభ్యర్థి సుమారు రూ.800 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు. రోజంతా జెండా మోసినందుకు రోజుకు రూ.500 ముట్టజెబుతున్నారని సమాచారం. గతంలో జరిగిన ఎన్నికల్లో చాలాసార్లు వివిధ రాజకీయ పార్టీల నేతలు అడ్డా కూలీలను తమ పార్టీలకు ప్రచారం చేసేందుకు వినియోగిం చుకున్నారు. కానీ ఈసారి ఖర్చు ఎక్కువఅవుతోందని వారి జోలికి వెళ్లడం లేదు. 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అడ్డా కూలీలను వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉపయోగిం చుకున్నారు. వారికి అల్పాహారం మొదలుకుని బిర్యానీలు, మద్యంతో పాటు డబ్బు లు ఇచ్చారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని అడ్డా కూలీలు ఆశలు పెట్టుకు న్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే ఉంది. ఏప్రిల్ 9న ప్రచార గడువు ముగియనుంది. ప్రచార ఖర్చు విషయంలో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో ప్రధాన పార్టీల నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తక్కువ ఖర్చు చేయాలని ప్లాన్‍ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కార్యకర్తల జోరు, హంగామా అంతగా కనిపించడం లేదు. పోలింగ్ రోజు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.