దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టినయ్ : చాడ వెంకట్‌‌‌‌రెడ్డి

దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టినయ్ : చాడ వెంకట్‌‌‌‌రెడ్డి

హుస్నాబాద్, వెలుగు: ‘దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి, వెలమదొరలు, భూస్వాములు, దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌లు, దోపిడీదారుల వారసులు ప్రజాస్వామ్యం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారు’ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌‌‌‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. గూండాలు, హంతకులు, స్వార్థపరులు రాజకీయాల్లో చేరి కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి దేశాన్ని పెత్తందార్ల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. ‘బీజేపీ హఠావో, దేశ్‌‌‌‌ బచావో’ నినాదంతో సీపీఐ పోరాటం చేస్తోందని చెప్పారు. ఇండియా కూటమి తరఫున ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రతిపాదించినట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు యెడల వనేశ్, కౌన్సిల్‌‌‌‌ సభ్యుడు అయిలేని సంజీవరెడ్డి పాల్గొన్నారు.