పరిగిలో బరిలో కాసాని వీరేశ్​?.. ముదిరాజ్​ ఓట్లే లక్ష్యంగా రాజకీయం

పరిగిలో బరిలో కాసాని వీరేశ్​?.. ముదిరాజ్​ ఓట్లే లక్ష్యంగా రాజకీయం

పరిగి, వెలుగు:  పరిగిలో కాంగ్రెస్ వర్సెస్ కాసాని వీరేశ్ అన్న తీరుగా రాజకీయాలు మారిపోతున్నాయి. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కొడుకు కాసాని వీరేశ్ పరిగి నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.  పరిగి సెగ్మెంట్​లో 2 లక్షల 50 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. ముదిరాజ్​ల ఓట్లు సుమారు 68 వేలు ఉన్నాయి.  దీంతో ముదిరాజ్​ఓట్లే లక్ష్యంగా కాసాని వీరేశ్ ​ముందుకెళ్తున్నారు. పరిగి సెగ్మెంట్​లోని ముదిరాజ్​లు అంతా ఒకేతాటిపైకి వచ్చి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని 6 నెలల ముందుగానే కాసాని వీరేశ్ గ్రౌండ్​ లెవెల్​లో ప్రచారం మొదలుపెట్టారు. 

ముదిరాజ్​ల సంఖ్యా బలం, ఐక్యతను చాటేందుకు పరిగిలో ఆత్మగౌరవ సభను  విజయవంతంగా నిర్వహించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరుడు పండుగల సాయన్న విగ్రహావిష్కరణ సభను కాసాని వీరేశ్​ భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ రెండు ప్రోగ్రామ్​లు సక్సెస్ కావడంతో పరిగిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడిపోయారు. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తండ్రి, సీనియర్ నేత హరీశ్వర్ రెడ్డి మరణం ఆ పార్టీకి పెద్ద మైనస్​గా మారింది. అయితే, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీల నాయకులు సైతం ముదిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓట్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టినట్లు తెలుస్తున్నది. 

మరోవైపు కాసాని వీరేశ్ తండ్రి ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్​గా పనిచేశారు. ఆ టైమ్ లో టీడీపీ నుంచి లబ్ధి పొందిన నాయకులు, మాజీ సర్పంచ్​లు, ఎంపీటీసీలు ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్నారు. వారందరినీ మళ్లీ టీడీపీలోకి తీసుకొచ్చి తన గెలుపునకు కృషి చేసే విధంగా కాసాని వీరేశ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాసాని వీరేశ్ పరిగి నుంచి పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టి. రామ్మోహన్ రెడ్డికి పరిగి టికెట్ దక్కింది. కాంగ్రెస్ ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్​లోనే ఆయన టికెట్ దక్కించుకున్నారు. 

అయితే, అంతకుముందు నుంచే ఆయన  విస్తృతంగా ప్రచారం చేపట్టారు. జనాల్లో తిరుగుతూ వారి సమస్యలపై పోరాడుతున్నారు. దీంతో పరిగి సెగ్మెంట్​లో ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి వర్సెస్ కాసాని వీరేశ్​ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే, ముదిరాజ్ ఓట్లు ఎక్కువగా ఉండటంతో కాసాని వీరేశ్​ఎలాగైనా గెలుపొందాలని వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా టీడీపీ కార్యకర్తలు, ముదిరాజ్ నేతలతో గ్రౌండ్​ లెవెల్ నుంచి ఆయన పనిచేస్తున్నారు.